ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 16 జరుగుతూ ఉంది, ఇటీవల లీగ్ స్టేజ్ ను పూర్తి చేసుకున్న ఐపీఎల్ ఈ రోజు నుండి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుపుకోనుంది. అయితే ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ లు మధ్యలో వర్షం కారణంగా ఆడకుండా ఉండే పరిస్థితి వచ్చి రద్దు అయితే.. ఏ విధంగా జట్టు ఫలితాన్ని నిర్ణయిస్తారు అన్న విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఐపీఎల్ పాలకమండలి పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్ లు వర్షం వలన రద్దు అయితే… సూపర్ ఓవర్ ను పెట్టి ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా ఆడే పరిస్థితి లేకపోతే లీగ్ స్టేజ్ లో ఆయా జట్లు చేసిన ఫలితం ఆదర్శంగా పాయింట్ల పట్టికలో ఉన్న స్థానాల ప్రకారం విజేతను ప్రకటిస్తారు.
ఐపీఎల్ 2023: ప్లే ఆఫ్ మ్యాచ్ లు వర్షం వల్ల రద్దయితే… ?
-