ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆప్స్ కు మరింత దగ్గర అవుతుంది. ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్ళడానికి మరింత దగ్గరవుతుంది. కాబట్టి ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కాగా గత మ్యాచ్ లో కోల్కతా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉండగా, రాజస్థాన్ మాత్రం అనూహ్యంగా ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. కాగా ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ గత కొన్ని మ్యాచ్ లుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వదిలి పెట్టి ఈ రోజు ఛేజింగ్ వైపు మొగ్గు చూపాడు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సంజు శాంసన్ పై భారీగా ఒత్తిడి ఉంది.