ఈ రోజు ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్ లలో 218 పరుగులు చేసింది. రోహిత్ మరియు ఇషాన్ ల తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే చివరి వరకు క్రీజులో ఉండి ముంబై కు గట్టిగా పోటీ ఇచ్చే స్కోర్ ను అందించాడు. ఈ క్రమములో సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ కెరీర్ లో మొదటి సారి సెంచరీ చేశాడు. కేవలం 49 బంతుల్లో 103 పరుగులు చేసి తన దైన స్టైల్ లో ఇన్నింగ్స్ ను ముగించాడు. సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు మరియు 4 సిక్సులు ఉన్నాయి.
ఇతని దెబ్బకు ఈ సీజన్ లో ప్రత్యర్ధులను తన స్వింగ్ తో ఇబ్బంది పెడుతున్న మహమ్మద్ షమి సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసిన షమీ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 53 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో సూర్య కుమార్ యాదవ్ అత్యధిక పరుగుల జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు.