IPL 2024 : రాణించిన కోహ్లీ… పంజాబ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన బెంగళూరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇక హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

బెంగళూరు ఒపెనర్లలో డూప్లెసిస్ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ మరొక ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లోనే 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 7 బంతుల్లో 12 పరుగులు చేయగా, రజత్ పాటిదర్ 23 బంతుల్లో 6 సిక్సర్లతో 55 పరుగులు రాబట్టాడు.గ్రీన్ 46* రాణించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 241 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, కావేరప్ప 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, కరన్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news