తొలి మ్యాచ్లో రాణించకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ పంజాబ్ కింగ్స్ తో రెండో మ్యాచ్‌లో తలపడనుంది.సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి ఖాతా తెరవాలని భావిస్తుంది. చిన్నస్వామి స్టేడియంపై ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్ జట్టు తో జరిగే మ్యాచ్ లు ఎలాగైనా గెలిచి ఖాతా తెరిచేందుకు ఆర్సీబీ ఎదురు చూస్తోంది.
తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి గొప్ప ప్లేస్ అని డుప్లెసిస్ పేర్కొన్నారు. జట్టులోని ప్లేయర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 84 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 39 విజయాలు, 40 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు.ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సొంత మైదానాల్లో ఆడిన జట్లన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి నేటి మ్యాచ్‌లో బెంగళూరు ఆ ఆనవాయితీని కొనసాగిస్తుందో, లేదో చూడాలి.