ఐపీఎల్ మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్ విడుదల

-

ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్ ని ఏప్రిల్ 07 వరకు ఇప్పటికే విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మిగతా షెడ్యూల్ ని విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా షెడ్యూల్ ని ప్రకటించారు.

తొలి విడుతలో ఏప్రిల్ 07 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మిగతా షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 08 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మే 21 క్వాలిఫైయర్ 01, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫైయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.  మే 21 మరియు 22 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్ 1,  ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 24, 26 తేదీల్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్ 2 మ్యాచ్ మరియు ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news