IPL 2024 : గ్రీన్ జెర్సీని రివీల్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం

-

ఐపీఎల్ అంటే చాలు ఇక క్రికెట్ అభిమానులకి పండగే. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిన్న కొత్త జెర్సీని రివీల్ చేసింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించి జెర్సీని ఆ జట్టు రివీల్ చేసింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంటి కి కింగ్ విరాట్ కోహ్లి, డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్ గ్రీన్ జెర్సీలో హాజరయ్యారు.పాత పేరు Royal Challengers BANGALORE Royal స్థానంలో మార్పులు చేసి Challengers BENGALURUగా మార్చిన సంగతి తెలిసిందే.ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news