IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది.ఇక ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ వేదికగా 7:30 pm కి మ్యాచ్ జరగనుంది.భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పైనే అందరి దృష్టి ఉంది.

ఇవాళ గెలిస్తే ఆరెంజ్ టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానానికి చేరనుంది. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ ఛాన్స్ కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : కోహ్లి, డుప్లెసిస్, పటీదార్, గ్రీన్, జాక్స్, కార్తీక్, లోమ్రార్, కర్ణ శర్మ, ఫెర్గూసన్, సిరాజ్, దయాల్

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : అభిషేక్, మార్క్రమ్, క్లాసెన్, నితీష్, సమద్, షాబాజ్, కమిన్స్ , భువీ, ఉనద్కత్, మార్కండే, నటరాజన్

Read more RELATED
Recommended to you

Latest news