రాయలసీమలో టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలో చేరిన సీనియర్ నేత

-

రాయలసీమలో ఎన్డీయే కూటమికి దెబ్బ దెబ్బ తగులుతూనే ఉంది. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీలను వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత వెళ్లిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ ఖండువ కండువా కప్పుకున్నారు. టికెట్లు ప్రకటించిన తరువాత కూడా పలు పార్టీల నేతలు వైసీపీ బాట పట్టడంతో చంద్రబాబుకి కునుకు లేకుండా చేస్తోంది.సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టిన తరువాత పలు పార్టీలకు చెందిన నేతలు భారీగా వైసీపీలో చేరుతున్నారు.

రాయలసీమ, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు చాలామంది ఇటీవల వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత రాయలసీమకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కమలాపురం టీడీపీ టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి వాటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 221 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో టీడీపీ, జనసేన పార్టీల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండటం విశేషం. ఇక గత ఎన్నికల్లో జనసేన తరుఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు సైతం భారీగా వైసీపీలో చేరడం జరిగింది. టీడీపీ, జనసేన బలంగా ఉన్న స్థానాల నుంచే ఈ చేరికలు ఉండటం విశేషం.దీంతో కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది.వలస వెళ్తున్న నాయకులను కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news