IPL 2024 : చెలరేగిన స్టబ్స్..లక్నో టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తర పడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

డిల్లీ విధ్వంసక ఓపెనర్ ఫ్రేజెర్ డక్ అవుట్ అయ్యాడు .ఇక మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు.షై హోప్ 27 బంతుల్లో 38, డిల్లీ కెప్టెన్ పంత్ 33 పరుగులతో రాణించారు. చివర్లో స్టబ్స్ 25 బంతుల్లో 57* పరుగులతో అదరగొట్టారు. అక్షర్ పటేల్ 14 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2వికెట్లు ,రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓడితే   ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news