ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు

-

ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని.. దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను వైఎస్ జగన్‌ సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని మండిపడ్డారు.

ఎన్నికల కోడ్‌కు కొన్ని నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్‌ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఎందుకు జమ కాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు.ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుంచి తరచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిందని తెలిపారు. అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ,పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయని, ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్‌కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news