ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ మధ్య 25 వ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని అలవోకగా చేదించింది. ముంబై ఓపెనర్లు తొలి వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 7 బౌండరీలు , 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 24 బంతుల్లో 34 పరుగులు చేశారు. ఇక సూర్య కుమార్ యాదవ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 19 బంతుల్లో 52 పరుగులు చేశారు. . ఇక చివర్లో కెప్టెన్ హర్డిక్ పాండ్య 21 రన్స్ ,తిలక్ వర్మ 16 పరుగులు చేసి ముంబైని గెలిపించారు.
కాగా, మొదటగా బ్యాటింగ్ కి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లలో విరాట్ కోహ్లీ 3 పరుగులు చేయగా, విల్ జాక్స్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రజత్ పాటిదర్ , డూప్లేసిస్ 3వ వికెట్ కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కెప్టెన్ డూప్లేసిస్ 40 బంతుల్లో 61 పరుగులు చేశారు. రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీ తో రాణించాడు.మహిపాల్ లామ్రార్, విజయ్ కుమార్ డక్ ఔట్ అయ్యారు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ బంతుల్లో 5 బౌండరీలు , 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగారు. ఐదు వికెట్లతో చెలరేగారు. ముంబై బౌలర్లలో కొయెట్టీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.