ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 ఈనెల 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ‘సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్’ జెర్సీనే ఖరారు చేసింది. SA2024′ టోర్నీ విజయంతో ‘సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్’ జెర్సీనే IPL-17కి కూడా ఉపయోగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. SA20 రిజల్ట్ ఐపీఎల్ లోనూ రిపీట్ అవుతుందా? కామెంట్ చేయండి.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి దక్షిణాఆఫ్రికా టీ20 లీగ్ 2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది.89 రన్స్ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.