సోమిరెడ్డికి టికెట్ లేనట్లేనా.. చంద్రబాబు పై సీనియర్ల అసంతృపి

-

తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం లేదని తేలిపోయింది. ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోగా వారి స్థానంలో కొత్తవారిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీంతో తొలి జాబితాలో పేరు లేని వారు రెండో జాబితాలోనైనా తమకు టిక్కెట్ కేటాయించాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేతను కలిసేందుకు క్యూ కడుతున్నారు. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా టీడీపీ – జనసేన తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, కీలక స్థానాల్లో టికెట్ ఆశించి.. భంగపడ్డ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ఎందుకీ దుర్భర పరిస్థితి అని కొందరు సీనియర్లు అధినేతను తిట్టుకుంటున్నారు. సుదీర్ఘ కాలం టీడీపీకి చేసిన సేవలకు గుర్తింపు దక్కలేదని ఆవేదన చెందుతున్నారు.

టికెట్ రాని నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తున్నారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, కళా వెంకట్రావు తదితరులు ఇప్పటికే అధినేతను కలిశారు. అయితే చంద్రబాబు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని వారు అనుచరుల వద్ద వాపోతున్నారు.ఇంకా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. సర్వేపల్లి టికెట్ పై సోమిరెడ్డి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. పలాస టికెట్ ను గౌతు శిరీష ఆశిస్తుండగా.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. అలాగే, ఎచ్చెర్ల టికెట్ కళా వెంకట్రావు ఆశిస్తున్నారు.త్వరలోనే రెండో జాబితా విడుదల కానున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అని టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నెల్లూరు విషయానికి వస్తే…మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అధినేతపై బోలెడంత నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.ఈసారి కూడా గోవర్ధన్ రెడ్డికే ఇక్కడి ఓటర్లు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.అయితే వరుసగా ఓడిపోతువస్తున్న సోమిరెడ్డి కాకానిపై పోటీ చేసి పరువు నిలుపుకోవాలని తాపత్రయ పడుతున్నారు.ఓటమి ఖాయమని తెలిసినా పోటీకి పట్టుబడుతున్నారు సోమిరెడ్డి. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్న చంద్రబాబు సర్వేపల్లిలో కొత్త అభ్యర్థి కోసం వేతుకుతున్నారని సమాచారం.పాపం సోమిరెడ్డి కి ఎంతటి దురవస్థ వచ్చిందో అని ఓటర్లు అనుకుంటున్నారున్

Read more RELATED
Recommended to you

Latest news