IPL 2024: నేడు పంజాబ్ కింగ్స్ VS సన్ రైజర్స్ హైదరాబాద్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లో ఇవాళ పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 2 మ్యాచ్ లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లు గెలిచింది .

ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి.14 మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవగా, 7 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే భారీ స్కోర్ నమోదు చేసిన సన్రైజర్స్ మంచి ఊపు మీదుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు చూడాలి మరి.

 

Read more RELATED
Recommended to you

Latest news