ఐపీఎల్‌లో మరో హిట్‌ వికెట్‌…!

ఐపీఎల్ లో మరో హిట్ వికెట్ నమోదైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ రషీద్‌ఖాన్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. అంతేకాదు ఒకే బంతికి రెండు సార్లు ఔటయ్యాడు. ఎంఎస్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడేందుకు రెడీ అయిన రషీద్‌ ఖాన్‌ను తెలివిగా బోల్తా కొట్టించాడు శార్దూల్‌ ఠాకూర్‌.బ్యాట్‌ను బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అది నేరుగా వెళ్లి లాంగాన్‌లో ఉన్న ఫీల్డర్ దీపక్ చహర్ చేతుల్లో పడింది. ఇంకేముంది రషీద్ ఔట్ అయ్యాడు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చహర్ క్యాచ్ పట్టకముందే.. రషీద్ ఔట్ అయ్యాడు. షాట్ ఆడే క్రమంలో రషీద్ ఆఫ్ స్టంప్‌ని కాలితో తొక్కేశాడు. అప్పుడే అతడు హిట్‌ వికెట్‌గా ఔట్ అయ్యాడు.