మహారాష్ట్ర గవర్నర్, సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గవర్నర్ రాసిన లేఖపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు సీఎం ఉద్ధవ్ థాక్రే. తన హిందుత్వపై ఎవరి నుంచీ సర్టిఫికేట్ అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ వీరిద్దరి మధ్య వివాదానికి కారణమేంటీ..? రాజభవన్, సీఎం ఆఫీసు మధ్య డిస్టాన్స్ పెరుగుతుందా…
మహారాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ లేఖ రాయడం… దానికి ఉద్ధవ్ థాక్రే కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా హీటెక్కింది. ఇటు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంతో….పొలిటికల్ వార్‌గా మారింది.
సోమవారం గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ…ఉద్ధవ్ ధాక్రేకు లేఖ రాశారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలో ఆలయాలు తెరిచేలా చూడాలని కోరారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు అయోధ్యను సందర్శించి రాముడిమీద మీ భక్తిని చాటుకున్నారు. ఆషాఢ ఏకాదశిన విఠల్ రుక్మిణి మందిరాన్ని దర్శించి పూజలు చేశారు. కానీ ఇప్పుడు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను రీఓపెన్ చేయట్లేదని, సెక్యులర్‌గా మారిపోయారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా పార్కులు, బీచ్‌లు, మాల్స్ ఓపెన్ చేశారని, వాటికి లేని నిబంధనలు ఆలయాలకే అడ్డువచ్చాయా అని ప్రశ్నించారు గవర్నర్.
గవర్నర్ లేఖపై స్పందించిన ఉద్ధవ్ థాక్రే… తన హిందుత్వపై ఎవరి నుంచీ సర్టిఫికెట్ అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. హఠాత్తుగా అష్ట దిగ్బంధనం విధించడం సరైనది కానట్లుగానే, ఒకేసారి పూర్తిగా ఉపసంహరించడం కూడా సరైనది కాదన్నారు. నేను హిందుత్వను అనుసరిస్తాను. నా హిందుత్వాన్ని మీరు తనిఖీ చేయనక్కర్లేదు అంటూ గవర్నర్‌కు రిప్లై ఇచ్చారు ఉద్ధవ్. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.