ఐపీఎల్ మెగా వేలం సాగుతుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. డేవిడ్ వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. కానీ ఇటీవల రిటెన్షన్ ప్రక్రియాలో వార్నర్ ను సన్ రైజర్స్ వదిలేసింది. దీంతో వార్నర్ మెగా వేలంలోకి అందుబాటులో ఉన్నాడు. అయితే వార్నర్ ఈ వేలంలో ఏ జట్టు దక్కించుకుంటుందో అనే ఉత్కంఠ ఉండేది.
రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో మొదలైన వార్నర్ వేలం. ముందుగా ఢిల్లీ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలో ఉంది. తర్వాత చెన్నై వెల్లిపోగా.. ముంబై కూడా బిడ్ వేసింది. కానీ చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు డేవిడ్ వార్నర్ ను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ 2022 లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. వీరితో శ్రేయస్ అయ్యార్ రికార్డు స్థాయిలో రూ. 12.25 కోట్లు కొల్లకొట్టాడు. అయ్యార్ ను కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. అలాగే శిఖర్ ధావన్ ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది.