ఐపీఎల్ 2023 : సూపర్ మ్యాచ్… టాస్ గెలిచిన ధోని !

-

ఈ రోజు డబుల్ హెడర్ లో భాగంగా రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ల మధ్యన జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై గత మ్యాచ్ లో విజయం సాధించడంతో ఉత్సాహంగా రెండవ విజయం కోసం బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని కసితో ఆడనుంది. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు రాణిస్తేనే ఏ జట్టుకైనా విజయం దక్కుతుంది.

ఈ పిచ్ అంతగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదని తెలుస్తోంది. మరి ముంబై ఇండియన్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తుంది అన్నది చూడాలి . కాగా టీం లోనూ పలు కీలక మార్పులు చేసింది, జొఫ్రా ఆర్చర్ కు బదులుగా ట్రిస్టాన్ స్టబ్స్ ను టీం లోకి తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news