నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ లు

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్ కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచులు ఎవరెవరు ప్లే ఆప్ కు వెళ్లనున్నారో డిసైడ్ చేయనుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కీలకం కాబోతోంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు వెళుతుందో లేదో తేలుస్తుంది. ముంబై ఇండియన్ ప్లే ఆఫ్స్ అకాశాలు మెరుగవ్వాలంటే సన్ రైజర్ హైదరాబాద్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

 నెగిటివ్ నెట్ రన్ రేట్ తో ఉన్న ముంబై  భారీ తేడాతోొ గెలిస్తేనే టాప్ 4 జట్లలో స్థానం సాధించే అవకాశం ఉంటుంది. ముంబైకి ఇది సాధ్యపడకపోతే కోల్ కతా నైట్ రైడర్స్ లాంఛనంగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. నేడు దుబాయ్ వేదికగా మరో మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి, మూడో స్థానాల్లో ఉన్న ఢిల్లీ, బెంగుళూర్ పోటీ పడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, చెన్నై, బెంగళూర్, కోల్ కతా మొదటినాలుగు స్థానాల్లో ఉన్నాయి.