“కొండపొలం” సినిమా కు మెగాస్టార్ రివ్యూ..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కొండపొలం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాను చిత్ర బృందంతో కలిసి మెగాస్టార్ నిన్న థియేటర్ లో చూశారు. అంతేకాకుండా ఈ సినిమాపై మెగాస్టార్ రివ్యూ కూడా ఇచ్చారు. కొండాపురం సినిమా చూశాను శక్తివంతమైన సందేశం తో వచ్చిన అందమైన గ్రామీణ ప్రేమ కథ చిత్రం అని చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

క్రిష్ చేసే సినిమాలు చూస్తా అని ఆయన సినిమాలు అంటే నాకు ఇష్టం అని చెప్పారు. కొండపొలం పుస్తకం చదివారా వైష్ణవ్ అడిగాడు అని… క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని చెప్పాడని తెలిపారు. క్రిష్ దర్శకత్వంలో సినిమా అనగానే ఒప్పుకో అని చెప్పినట్టు తెలిపారు. క్రిష్ నటీ నటుల నుండి అద్భుతమైన నటనను రాబట్టే విధానం తనకు చాలా ఇష్టమని మెగాస్టార్ అన్నారు. ఈ చిత్రం ఎన్నో అవార్డులు పొందుతుందని నమ్ముతున్నానని చెప్పారు.