ఆల్రెడీ ఐపీఎల్ సెమీస్ ఆశలని వదిలేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఈరఒజు జరుగుతున్న ముంబై మ్యాచులో పూర్తిగా విఫలం అయ్యింది. మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి అందరికీ షాక్ ఇచ్చింది. ఓపెనర్లుగా దిగిన రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, ఆ తర్వాత వచ్చిన అంబటిరాయుడు, జగదీషన్ వెనువెంటనే వెనుదిరిగారు. ధోనీ కొద్దిగా ఆడే ప్రయత్నం చేసినా పదహారు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
మిగిలిన వారిలో సామ్ కరన్ ఒక్కడే జట్టుకి సరైన స్కోరుని అందించాడు. సామ్ కరణ్ సరిగ్గా ఆడకపోతే జట్టు స్కోరు రెండంకెలకే పరిమితం అయ్యేది. 47 బంతుల్లో 52 పరుగులు (4ఫోర్లు,2 సిక్సర్లు) బాది చెన్నై కి డీసెంట్ స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు, బుంరా, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు, నాథన్ కాల్టర్ ఒక వికెట్ తీసుకున్నారు. మొత్త 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేయగలిగింది.