ఏపీలో మళ్ళీ మొదలయిన లోకల్ వార్.. అసలు ఎన్నికలు జరుగుతాయా ?

-

ఏపీల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణ మీద ఏపీలో మళ్లీ రచ్చ మొదలయింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది ఎస్‌ఈసీ. ఈ సమావేశానికి వచ్చే వివిధ రాజకీయ పార్టీల నేతల వారి వారి వాదనలను వినిపించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన జరగబోయే పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నెలకొంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమనే భావనలో ప్రభుత్వం ఉంది. గతంతో పోల్చుకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినా మళ్లీ అవి తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన ప్రభుత్వంలో కన్పిస్తోంది. ఈ క్రమంలో మంత్రి గౌతమ్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని.. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బీహార్‌లో పరిస్థితికి.. ఏపీలో పరిస్థితికి పోలికే లేదని.. అక్కడ జరిగేవి సాధారణ ఎన్నికలనే విషయాన్ని గుర్తు చేశారు గౌతమ్‌ రెడ్డి. అయితే ఎన్నికలు పెట్టే అంశంపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని టీడీపీ స్వాగతిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

Read more RELATED
Recommended to you

Latest news