క్షిపణి ఉక్రేనియన్ విమానాన్ని కూల్చివేసిందనే ఆరోపణలను ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఖండించింది. ఆ ఆరోపణలు అన్నీ అవాస్తవాలు అని అని ఇరాన్ పౌర విమానయాన చీఫ్ అలీ అబేద్జాదే కొట్టిపారేశారు. ఈ విమాన ప్రమాదంలో 176 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. బ్రిటన్ మరియు కెనడా క్షిపణి విమానాన్ని కూల్చిందనే అనుమానం వ్యక్తం చేసాయి.
బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ హత్యకు ప్రతీకారంగా టెహ్రాన్ ఇరాక్‌లోని యుఎస్ బలగాల లక్ష్యంగా చేసుకుని, క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే బోయింగ్ 737 కుప్పకూలింది. విమానం కూలుతున్న సమయంలో బయటకు వచ్చిన కొన్ని వీడియోలు ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులే విమానం కూలడానికి కారణమనే,
ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఇరాన్ క్షిపణి టెహ్రాన్ నుంచి బయలుదేరిన తరువాత ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ పిఎస్ 752 ను కూల్చివేసిందని పలు ఇంటెలిజెన్స్ వర్గాలు పెర్కొన్నాయని పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసారని అలాంటిది ఏమీ జరగలేదని ఇరాన్ పేర్కొంది.