చిరుత పులి దెబ్బకు తెలంగాణాలో పరిక్షలు వాయిదా…!

-

చిరుతపులి’ చూస్తేనే గుండెలు జారిపోతాయి కదా…? అవును మరి అది అంత భయంకరంగా ఉంటుంది. ఎక్కడో ఒకరిద్దరు మినహా దాన్ని చూసి భయపడని వారు ఉండరు. రెప్ప పాటులో దాడి చేసి మన ప్రాణాలను హరిస్తుంది చిరుత. ఇప్పుడు దానికి భయపడే తెలంగాణాలో పరిపక్షాలు వాయిదా వేసారు అధికారులు. అవును ఒక విశ్వ విద్యాలయంలో పులికి భయపడి పరిక్షలు వాయిదా వేసారు.

వివరాల్లోకి వెళితే డిచ్ పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్నాళ్ళుగా పులి సంచరిస్తుంది. దీనితో ఆ ప్రాంతంలో ప్రజలు వెళ్ళాలి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉదయం వాకింగ్ కి వెళ్ళిన వారికి ఈ పులి కనపడినట్టు వార్తలు రావడంతో వర్సిటీ ప్రాంగణంలో బయట తిరగాలంటేనే విద్యార్థులు, సిబ్బంది భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వర్సిటి అధికారులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, చిరుత కోసం గాలింపు చేపట్టారు. అయితే ఆ పులి ఆచూకి మాత్రం లభించలేదు. దీనితో పులి దెబ్బకు పీజీ పరీక్షలను కూడా వాయిదా వేశారు వర్సిటి అధికారులు. వాయిదా వేసిన పరీక్షలను జనవరి 22 తర్వాత నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆ చిరుత ఎక్కువగా ఎంసీఏ బిల్డింగ్ వద్ద సంచరిస్తుందని, అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుందని విద్యార్ధులు ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news