IRCTC అంబేద్కర్ యాత్ర… టూర్ పూర్తి వివరాలు ఇవే..!

-

IRCTC వివిధ రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ని చాలా మంది వినియోగించుకుంటున్నారు. తాజాగా IRCTC సరి కొత్త ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ తో ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా టూర్ వెళ్లి వచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దేఖో అప్నా దేశ్ ప్రచారంలో భాగంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతున్నారు.

IRCTC

బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరు తో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ టూర్ మొదలు అవ్వనుంది. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో ఇది స్టార్ట్ అవుతుంది.

మొదటి రోజు ప్రయాణమే ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు మహూ రైల్వే స్టేషన్‌కు రీచ్ అవుతారు. తరవాత మహూ తీసుకెళ్తారు. భీమ్ జనమ్ భూమి అని కూడా దీన్ని పిలుస్తారు. ఆ తరవాత నాగ్‌పూర్ బయల్దేరాలి. మూడో రోజు ఉదయం 8 గంటలకు నాగ్‌పూర్ రీచ్ అవుతారు. దీక్షా భూమి చూసేసి సాంచీ బయల్దేరాలి.సాంచీ స్థూపం, ఇతర బుద్ధిస్ట్ సైట్స్ చూడొచ్చు.

తర్వాత వారణాసి బయల్దేరాలి. ఐదో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం చూసేసి… గయ బయల్దేరాలి. ఆరో రోజు బోధ్‌గయలో మహాబోధి ఆలయం వంటివి చూడొచ్చు. ఏడో రోజు రాజ్‌గీర్ వెళ్ళాలి. అక్కడ నలందా శిథిలాల ఇవన్నీ చూడచ్చు. ఎనిమిదో రోజు ఢిల్లీ రీచ్ అవ్వచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. డబుల్ ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.29,440 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news