మీరు చక్కగా దేవాలయాలను దర్శించుకుని రావాలనుకుంటున్నారా..? అయితే ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చిన ఈ ప్యాకేజీని చూడండి. ఐఆర్‌సీటీసీ ఎన్నో ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది. చక్కగా మీరు ఇప్పుడు నవరాత్రి స్పెషల్ మాతా వైష్ణో దేవి యాత్ర టూర్ వేసొచ్చేయచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. జమ్యూకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉంటే ఈ టూర్ వేసేయచ్చు.
‘నవరాత్రి స్పెషల్ మాతా వైష్ణో దేవి యాత్ర టూర్’ పేరుతో దీన్ని ఐఆర్‌సీటీసీ తీసుకు రావడం జరిగింది. నాలుగు నైట్స్, ఐదు డేస్ టూర్ ఇది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ టూర్ జరుగుతుంది. సెప్టెంబర్ 30, 2022న ఇది ప్రారంభం అవుతుంది. ఢిల్లీ నుంచి భారత్ గౌరవ్ రైలు మొదలవుతుంది. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, అంబాలా, సిర్హింద్, లూథియానా స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది.
ఇక ఈ టూర్ ఎలా సాగుతుంది అనేది చూస్తే.. మొదటి రోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కత్రా రైల్వే స్టేషన్‌కు రీచ్ అవుతారు. హోటల్‌లో తరవాత స్టే చేసాక మాతా వైష్ణో ట్రెక్‌ను ప్రారంభిస్తారు. కత్రాలో స్టే చెయ్యాలి తరవాత.
మూడో రోజు మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్లి అక్కడే స్టే చెయ్యాలి. నాలుగో రోజు యాత్రికులు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కత్రా రైల్వే స్టేషన్‌కు వెళ్ళాలి. ట్రైన్ ఎక్కితే ఐదో రోజు ఢిల్లీ చేరచ్చు. ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీ రూ.13,790, డబుల్/ట్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.11,990 వుంది. పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో చూడచ్చు.