ఎండాకాలంలో కూల్ టూర్ వేయాలని చూస్తున్నారా..? అయితే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. రూ.12,000 లోపే మీరు ఈ టూర్ ని వేసేయచ్చు. హైదరాబాద్ నుండి ఊటీ ఇంత తక్కువ ధరకే వెళ్లి వచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. చాలా మంది ఊటీకి వెళ్లాలని అనుకుంటారు. వేసవి లోనే కాదు శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీ వెళ్తారు. ప్రకృతి అందాలు చూడటంతో పాటు, అక్కడి చల్లని వాతావరణంలో సరదాగా గడిపితే ఎంతో బాగుంటుంది. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.
అల్టిమేట్ ఊటీ పేరుతో ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది ఇది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మొదటి రోజు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఊటీకి తీసుకెళ్తారు. బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ చూడొచ్చు. నైట్ ఊటీ లోనే స్టే చెయ్యాలి. మూడవ రోజు ఊటీ లోకల్ టూర్ ఉంటుంది.
దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ఇవన్నీ కూడా చూసేయచ్చు. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఐదో రోజు తిరుగు ప్రయాణం అంతే. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్కు రూ.11,870, డబుల్ షేరింగ్కు రూ.15,220, సింగిల్ షేరింగ్‌కు రూ.28,950 కట్టాలి. కంఫర్ట్ ప్యాకేజీ అయితే ట్రిపుల్ షేరింగ్కు రూ.14,330, డబుల్ షేరింగ్కు రూ.17,670, సింగిల్ షేరింగ్‌కు రూ.31,410 చెల్లించాలి. ఎక్కువ మంది బుక్ చేసుకుంటే ధర తగ్గుతుంది.