పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ప్రజల ప్రాణాలమీదకు వచ్చింది. రోజురోజుకు ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ దేశ ప్రజలను చావు దెబ్బ కొట్టింది. తినడానికి తిండి లేక కష్టాల్లో మగ్గుతున్నా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇప్పటివరరకూ సబ్సిడీలో ప్రజలకు గోధుమపిండిని అందించిన పాక్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారిగా ఆ సబ్సిడీని ఎత్తేసింది. గోధుమపిండితో పాటు నిత్యావసరాల సరుకులపైనా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీని ఎత్తేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నా.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు అందించకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గోధుమపిండి సహా నిత్యావసరాలపై సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం.. ప్రభుత్వ పంపిణీ దుకాణాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకోకుండా పాక్ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని స్థానిక పౌరులు విమర్శిస్తున్నారు.