విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు టూర్…ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ వివరాలివే..!

-

మీరు ఏదైనా విదేశీ టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. ఈ ప్యాకేజీ ద్వారా విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం విభాగం అయిన ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకు వచ్చారు.

ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్ పేరు తో దీన్ని తీసుకు వచ్చారు. బ్యాంకాక్, పట్టాయా వంటివి ఈ ప్యాకేజీ కింద తీసుకు వచ్చారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2022 డిసెంబర్ 8న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. ఇక వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్ వివరాలను చూస్తే.. మొదటి రోజు ఉదయం విశాఖపట్నంలో టూర్ స్టార్ట్ అవుతుంది.

సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం లో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ వెళ్ళచ్చు. అక్కడ నుండి పట్టాయా వెళ్ళాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ వెళ్లాల్సి వుంది. ఆ తరవాత సాయంత్రం అల్కజార్ షో ని మీరు చూడొచ్చు. ఆ తరవాత రాత్రికి పట్టాయా లో స్టే చేయాలి. మూడో రోజు పట్టాయా ని చూడాల్సి వుంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ నుండి కోరల్ ఐల్యాండ్ కి తీసుకు వెళ్తారు. ఆ తరవాత మధ్యాహ్నం ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం ఉంటుంది.

రాత్రికి పట్టాయాలో స్టే చెయ్యాలి. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ వెళ్ళాలి. రాత్రికి బ్యాంకాక్‌లో స్టే చేయాలి. ఫిఫ్త్ డే బ్యాంకాక్ హాఫ్ డే టూర్ ఉంటుంది. అలానే మీరు గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ వంటివి చూసేయచ్చు. తరవాత ఆరో రోజు బ్యాంకాక్‌ లో అర్ధరాత్రి 2.55 గంటలకు స్టార్ట్ అయ్యిపోతారు. పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ కోసం ఒకరికి 2000 థాయ్ భట్ పే చెయ్యాల్సి వుంది. ఇక ప్యాకేజీ ధరల కోసం చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.63,310 ని పే చేయాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news