కరోనాతో రకుల్ ప్రీత్ సింగ్ కి కలిసొస్తుందా ..అయితే రకుల్ ఈజ్ బ్యాక్ ..!

-

తారాజువ్వలో టాలీవుడ్ లోకి దూసుకువచ్చిన బ్యూటి ఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో కెరటం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికి సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బాగా ఫేమస్ అయింది. ఈ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్షించింది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. నాగచైతన్య, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రాం చరణ్, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. వరసగా బ్లాక్ బస్టర్ సినిమాలని అందుకుంది.

 

దాంతో టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా రకుల్ ప్రీత్ సింగ్ తప్ప మరో పేరు కాదు అన్నట్టుగా పాపులర్ అయింది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేంత బిజీగా తయారైంది. అంతేకాదు రకుల్ డిమాండ్ చేయకుండానే కోటి, రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు మేకర్స్. అదే సమయంలో తమిళం, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలనుంచి జోరుగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో కూడా హిట్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో ను ఒకటి అరా హిట్స్ ని అందుకుంది. అయితే ఈ సక్సస్ ఫుల్ జర్నీ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది.

వరసగా ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. దానికి తోడు పూజా హెగ్డే, సమంత, కీర్తి సురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ తాకిడి గట్టిగా తగిలింది. ఆ తాకిడి తట్టుకోలేక వచ్చిన ప్రతీ సినిమా కథ ఎలాంటిదో అని ఆలోచించకుండా ఒప్పుకొని పొరపాటు చేసింది. దాంతో రేస్ లో వెనకపడి పోయింది. అదే సమయంలో టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జున తో మన్మధుడు 2 లో అవకాశం వచ్చిందని ఆవేశపడి ఒప్పుకుంది. ఈ సినిమా మొత్తానికే రకుల్ ని కిందకి లాగేసింది. ఇక తెలుగులో కనుమరుగవుతుందని అందరు అభిప్రాయపడ్డారు.

కాని లక్ కలిసొచ్చి యంగ్ హీరో నితిన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ తో రకుల్ మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రావాలని తాపత్రయపడుతుంది. అయితే ఇదే సమయంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్ ని కాకుండా ఆల్రెడి సక్సస్ ట్రాక్ ఉన్నవాళ్ళని తిసుకోవాలని చూస్తున్నారట. వాళ్ళలో ముందు రకుల్ గురించే ఆలోచిస్తున్నారట. మొత్తానికి కరోనా రకుల్ కి కలిసొచ్చిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version