తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడ ఫ్యామిలీ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా పేరుపొందింది. ఇక రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా ఒక వెలుగు వెలిగాడు. వెంకటేష్ బాల నటుడుగా కేవలం ఒకే ఒక సినిమాలో నటించారు. ఇక తర్వాత తనని పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా పెట్టి చదువు కోసం విదేశాలకు పంపించారు. ఆ తర్వాత వెంకటేష్ పూర్తిగా తన చదువు పైన దృష్టి పెట్టారు. వెంకటేష్ ఫారిన్ లో చదువును పూర్తి చేసే సమయంలో. అప్పుడే హీరోగా చేయడానికి సిద్ధమయ్యారు రామానాయుడు. దాంతో వెంకటేష్ ఇండియాకి తిరిగి రావడం జరిగింది.ఇక ఆ సమయంలో కృష్ణతో రామానాయుడు కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు ఆ సినిమాకి డైరెక్టర్గా రాఘవేంద్రరావుని ఎంచుకున్నారు కానీ కృష్ణ షూటింగులతో బిజీగా ఉండడంతో తన డేట్లు అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు చాలా ఆలస్యం అయ్యేలా ఉన్నదని.. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఇచ్చిన డేట్లలోని తన బ్యానర్ లోనే ఒక సినిమాను చేయాలని రామానాయుడు ఉన్న సమయంలోనే తన కొడుకు వెంకటేష్ ను సినీ రంగంలోకి హీరోగా పరిచయం చేయాలని భావించారు. ఆ తరువాత పరుచూరి బ్రదర్స్ కు కథ సిద్ధం చేయమని తెలియజేశారు. అలా తిరకేక్కించిన చిత్రమే కలియుగ పాండవులు.అలా మొదటిసారిగా హీరోయిన్ ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన శక్తి కపూర్ కూడా మొదటిసారి టాలీవుడ్ కి విలన్ గా పరిచయమయ్యారు. ఇక 1986 ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్నిచోట్ల 50 రోజులు 100 రోజులు వేడుకలు కూడా జరుపుకుంది. అలా తన మొదటి చిత్రంతోనే వెంకటేష్ మంచి సక్సెస్ను అందుకున్నారు. ఇక తర్వాత వెంకటేష్ తన కెరియర్ పరంగా దూసుకు వెళ్లారు వెంకటేష్ కెరియర్లు మలుపు తిప్పిన సినిమాలలో చంటి ,బొబ్బిలి రాజా, తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు.