ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఇవాళ వారికి ఫ్రీ ప్రయాణాలు

-

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇవాళ 75 సంవత్సరాలు కలిగిన వారికి తెలంగాణ ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ ఉంటుందని.. అలాగే ఇవాళ పుట్టబోయే పిల్లలు, 12 ఏళ్ల లోపు వారికి వరకు ఫ్రీ ట్రావెల్ ఉంటుందని ప్రకటించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

నిజామాబాద్ జిల్లా ఆర్టీసిని సందర్శించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గత 10 నెలల నుంచి ఆర్టీసీకి ప్రజల ఆదరణ లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఓకే రోజు రాఖీ పండుగ రోజున లక్ష మంది ఆర్టీసీలో ప్రయాణించారని తెలిపారు.

75 కిలోమీటర్ల వరకు 1కేజీ వరకు ఫ్రీ కార్గో సర్వీస్ కల్పిస్తున్నాము.. అలాగే టౌన్ లో ఎగ్జిమిషన్, ముగ్గురు ఫ్రీడం ఫైటర్స్ కి సన్మానించుకోడం జరుగుతుందని తెలిపారు సజ్జనార్. వచ్చే రోజుల్లో ఇంకా కొత్త బస్ లు వస్తున్నాయని.. ఆర్టీసి సిబ్బంది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని కొనియాడారు. వారందరికీ ఆర్టీసి ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసి ఎండీ సజ్జానార్. ఆర్టీసీని బలోపేతం చేయాలని సజ్జనార్ కోరారు. అందరూ ఆర్టీసీ బస్సును వాడాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news