ఆర్ ఆర్ ఆర్ దాన‌య్య‌కు త‌ల‌కు మించిన భారం అవుతోందా?

-

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఏ సినిమా చేసినా క‌నీసం రెండేళ్లు అయినా స‌మ‌యం తీసుకుంటాడు. మ‌రి ఆయ‌న చేసే సినిమాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఇప్పుడు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ (RRR Movie)కు క‌రోనా కూడా తోడ‌వ‌డంతో ఇంకాస్త లేట‌వుతోంది. అనుకున్న స‌మ‌యానికి ఇది విడుద‌ల అవుతుందా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే ఎఫెక్ట్ మాత్రం నిర్మాత‌పై భారీగా ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తుండ‌టంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలున్నాయి. అయితే ఈ మూవీ కోసం డీవీవీ దానయ్య ఏకంగా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నార‌ని స‌మాచారం. కాక‌పోతే ఆర్ ఆర్ ఆర్ అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాక‌పోవ‌డంతో ఆ ఖ‌ర్చు భార‌మంతా దానయ్యపై ప‌డే అవ‌కాశం ఉంది.

ఆర్ ఆర్ ఆర్‌కు ఇప్ప‌టికే చేసిన అప్పులపై వడ్డీల భారం ఎక్కువ‌యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న ఇద్దరు ఫైనాన్షియర్ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద మొత్తంలో ఫైనాన్స్ తీసుకోవ‌డంతో ఆ భారం ఎక్కువ‌యిన‌ట్టు తెలుస్తోంది.ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ ప‌లుమార్లు వాయిదా పడటంతో పాటు.. అస‌లు ఎప్పుడు వ‌స్తుందో కూడా అర్థం కాకుండా ఉంది. అయితే అక్టోబర్ లో వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నా… సంక్రాంతి వరకూ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version