మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. లోన్స్ ని తక్కువ వడ్డీకే ఈ బ్యాంక్ ఇప్పుడు అందిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ మూడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు తీపికబురు అందించింది.
తాజాగా ఈ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారికి రిలీఫ్ గా ఉంటుంది. ఈజీగా కస్టమర్స్ చౌక వడ్డీకే రుణాలు పొందొచ్చు.
తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను తగ్గించింది బరోడా బ్యాంక్. ఎంసీఎల్ఆర్ రేటు లో 0.05 శాతం కోత విధించింది. ఈ కొత్త రూల్ జూన్ 12 నుంచి అమలు లోకి వస్తుంది. ఇక ఎంసీఎల్ఆర్ రేటును చూస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 7.35 శాతానికి తగ్గించేసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.2 శాతానికి క్షీణించింది.
అదే మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.1 శాతానికి తగ్గింది. దీనితో లోన్స్ తీసుకునే వాళ్లకి మంచి బెనిఫిట్ కలుగుతుంది.