ఇంట్లోకి పిచుకలు, సీతాకోక చిలుకలు రావడం శుభమా అశుభమా..!

-

ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం కామన్.. కొన్ని చూస్తే.. శుభం అనుకుంటాం.. మరికొన్ని చూస్తే అశుభం అనుకుంటాం..ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే.. పిల్లి ఎదురువస్తే.. అపశకునం అని మళ్లీ లోపలకి వెళ్తారు. అలాగే కొన్నింటిని మ‌నం ల‌క్ష్మీ ప్ర‌దంగా భావిస్తాం. ఎటువంటి ప‌క్షులు మ‌న ఇంట్లోకి వ‌స్తే శుభం క‌లుగుతుంది… మ‌న ఇంట్లోకి రాకూడ‌న‌టువంటి ప‌క్షులు ఏవి అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పిచుకుల మ‌న ఇంట్లోకి ప్ర‌వేశిస్తే చాలా మంచి జ‌రుగుతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. పిచుకులు ఇంట్లోకి రావ‌డాన్ని శుభ సూచ‌కంగా భావించాలి. పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే ల‌క్ష్మీ ప్ర‌దం. లక్ష్మీ క‌టాక్షం మ‌రింత పెరుగుతుంద‌ని అర్థం. రెండు పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే ఆ ఇంట్లో క‌ళ్యాణం జర‌గ‌బోతుంద‌ని లేదా సంతానం క‌ల‌గ‌బోతుంద‌ని అర్థం.

అలాగే కాకిని చూస్తే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కొంద‌రు దీనిని అశుభంగా భావిస్తారు. కానీ కాకిని పితృ దేవ‌త‌ల‌కు ప్ర‌తీక‌.. కాకి ఎగురుతూ ఇంటికి వ‌స్తే చాలా మంచిది. పెద్ద‌లు ఆశ్వీర‌దించ‌డానికి వ‌చ్చార‌ని భావించాలి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కాకి త‌ల మీద త‌నిత్తే ఏదో ప్ర‌మాదం జ‌ర‌గ‌బోతుంద‌ని , ఏదో చెడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం.

గుడ్ల‌గూబ‌. దీనిని చూస్తేనే అంద‌రూ భ‌య‌ప‌డి పోతుంటారు. చూడ‌డానికి ఈ గుడ్ల‌గూబ చాలా భ‌య‌కరంగా ఉంటుంది. కానీ గుడ్ల‌గూబ ఇంట్లోకి వ‌స్తే చాలా మంచిది. గుడ్ల‌గూబ ఇంటికి వ‌స్తే ల‌క్ష్మీ రాబోతుంద‌ని అర్థం. గుడ్ల‌గూబ ల‌క్ష్మీ దేవికి వాహ‌నం కాబ‌ట్టి ఇది ఇంట్లోకి వ‌చ్చిన శుభ‌సూచ‌కంగా భావించాలి.

పాము ఇంట్లోకి వ‌స్తే ఇంట్లో ఉన్న వ్య‌క్తుల‌కు మాన‌సిక వ్య‌ధ ఎక్కువ‌వుతుంది. ఏదో అశాంతి రాబోతుంద‌ని అర్థం. పాము ఇంట్లోకి రావ‌డం అంత మంచిది కాదు.

తేలు, జ‌ర్రీ ఇంట్లోకి రావ‌డం మంచి విష‌యం కానే కాదు. ఇళ్లు శుభ్రంగా లేన‌ప్పుడు, ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా ఉన్నప్పుడు తేలు, జ‌ర్రీలు ఇంట్లోకి వ‌స్తాయి. వీటి వల్ల చెడే ఎక్కువ‌గా జ‌రుగుతుంది. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు తేలు, జ‌ర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

కొండ‌మిడ‌తలు కానీ కందిరీగ వంటివి కానీ ఇంట్లోకి వ‌స్తే చాలా శుభప‌ద్రంగా చెప్ప‌వ‌చ్చు. కందిరీగ‌లు వ‌చ్చి ఇంట్లో గూడు క‌డితే చాలా మంచిదని పండితులు అంటున్నారు…ఇది ల‌క్ష్మీ క‌టాక్షానికి సంకేతం. కందిరీగ‌లు క‌ట్టిన గూడు మ‌ట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జ‌రుగుతుంది. నెగెటివ్ ఎన‌ర్జీ త‌గ్గుతుంది. మాన‌సిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

గోడ‌ల‌పై బ‌ల్లులు లేని ఇళ్లే ఉండ‌దు. బ‌ల్లులు ఇంట్లో ఉండ‌డాన్ని శుభ‌సూచ‌కంగా భావిస్తారు. శాస్త్రీయంగానూ బ‌ల్లులు ఇంట్లో ఉండ‌డం మంచిది.

కంటి మిడ‌త‌ల గురించి అంద‌రికి తెలిసే ఉంటుంది. వ‌ర్షాకాలంలో లైట్ల దగ్గరకు ఇవి బాగా వస్తాయి.. ఈ కంటి మిడ‌త‌లు ఇంట్లోకి రావ‌డం శుభానికి సంకేతం. పూలు ఎక్కువ‌గా ఉన్న ఇండ్ల‌ల్లోకి సీతాకోక చిలుక‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి.

సీతాకోక చిలుక‌లు ఇంట్లోకి వ‌స్తే ఇళ్లు పూల వ‌నంలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లో ఉండేవారికి బాధ‌లు తొల‌గిపోయి ఆనందంగా మార‌తారు. ల‌క్ష్మీప్ర‌దం అని పండితులు అంటున్నారు.. ల‌క్ష్మీప్ర‌దం అంటే డ‌బ్బు ఒక్క‌టే కాదు సంతోషం, సంతానం, మ‌న‌శాంతి. క‌రువు లేకుండా ఉండ‌డం.
ఎవ‌రి ద‌గ్గ‌ర చేయిచాచ‌కుండా ఉండ‌డం. ఇవి అన్నీ కూడా ల‌క్ష్మీత‌త్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి వ‌స్తే ల‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news