బుల్లి తెర పై రారాణి గా మాటల కవిగా గుర్తింపు తెచ్చుకున్న సుమ దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా మళ్లీ తెరపై దర్శనమిచ్చింది. నిజానికీ సుమా అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమా.. ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమా పలు సినిమా ప్రమోషన్స్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అవుతూ రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. యాంకర్ గా మంచి లాభాలతో దూసుకుపోతున్న సుమా తాజాగా జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా మాత్రం ఈమెకు నష్టం తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జయమ్మ పంచాయతీ సినిమా లాభ నష్టాల తో సుమకి ఏం సంబంధం ఉంటుంది.నష్టాలు లాభాలు కేవలం నిర్మాతలకు మాత్రమే కదా అని అనుకుంటే పొరపాటే..
అసలు విషయం ఏమిటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. సుమ కనకాల జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా పూర్తిగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాతలు ఆమెకు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పగా ఆమె కొంత మాత్రమే తీసుకొని లాభాలలో వాటా కూడా కోరినట్లు సమాచారం. అందుకోసం నిర్మాతలు ఈమెకు 85 లక్షల రూపాయలను మాత్రమే రెమ్యునరేషన్ గా ఇచ్చారు. ఇక ఆమె లాభాలలో ఏకంగా రూ.4 నుండి రూ.6 కోట్ల రూపాయల వరకు లాభం వస్తుందని భావించింది. కానీ ఎట్టకేలకు మొదటి రోజే ఈ సినిమా కొంచెం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఫలితాలను చూసి సుమ ఖంగుతిన్నట్లూ తెలుస్తోంది. ఇకపోతే సుమ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి గా మిగిలిపోయింది. సినిమా పూర్తిగా నష్టపోయినట్లు సమాచారం. మరి ఈ విషయంపై శివ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి వుంది.