‘అఖండ’ను మించిన పోరాట ఘట్టాలు..అంచనాలను మించిన NBK 107!

-

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ అని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన పిక్చర్స్ అన్నిటిలోనూ యాక్షన్ కంపల్సరీగా ఉంటుంది.

ఈ క్రమంలోనే బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న NBK 107లోనూ యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. స్టోరిలో భాగంగా ఎలివేషన్ సీన్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ జరుగుతోంది. హైదరాబాద్ శివారులో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పెద్ద సెట్స్ వేశారట. బాలయ్య ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నారు. మాస్ ప్లస్ క్లాస్ టచ్ ఉన్న రోల్ ను బాలయ్య ప్లే చేస్తున్నారని సమాచారం.

రామ్ -లక్ష్మణ్ మాస్టర్స్ ఈ ఫిల్మ్ లో రాబోయే ఫస్ట్ ఫైట్ ను చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేశారని టాక్. ఈ ఫైట్ సీన్ సుమారు 25 నిమిషాల పాటు ఉంటుందని వినికిడి. గోపీచంద్ మలినేని గత చిత్రం ‘క్రాక్’లోనూ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయని సినీ అభిమానులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news