పెరిగిన విమానం టికెట్ ధరలు.. చమురు ధరే కారణమా..?

-

విమాన ప్రయాణం మళ్లీ ఖరీదు కానుంది. విమాన ఛార్జీలను కనీసం 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో ప్రైస్ బ్యాండ్‌ను 10 నుంచి 30 శాతానికి పెంచాలని నిర్ణయించగా.. ఆ సమయంలో కనిష్ట అద్దె 10 శాతం, గరిష్ట అద్దె 30 శాతం వసూలు చేశారు. అయితే ప్రస్తుతం ప్రైస్ బ్యాండ్‌లో కనీస ఛార్జీలను 5 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ధరలు వచ్చే నెల (ఏప్రిల్) చివరి వారంలో అమలు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే విమాన ఛార్జీల పెంచడానికి.. ఎటీఎఫ్ ఇంధన ధరల పెరగుదల కారణమని.. అందుకే ధరలను పెంచడం జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది.

విమానం
విమానం

ఈ మేరకు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ ప్రయాణికుల సంఖ్య 3.5 మిలియన్లు దాటితే.. 100 శాతం సామర్థ్యంతో విమానయాన ప్రయాణాలు కొనసాగించడానికి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రయాణాలు నెలలో కనీసం మూడు సార్లు అమలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన విమాన ప్రయాణం.. అన్‌లాక్ ప్రక్రియతో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా 7 వాయు మార్గాలను విభజించి.. ఆయా ప్రాంతాలను బట్టి గరిష్ట ఛార్జీలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఏటీఎఫ్ ధరల్లో నిరంతరం పెరుగుదల ఉంది కాబట్టి.. అప్పర్ క్లాస్ టికెట్ ధరలు మార్చకుండా, లోవర్ క్లాస్ టికెట్ ధరలను 5 శాతం పెంచామని నిర్ణయించారు. అయితే ప్రయాణీకుల రద్దీ 3.5 లక్షలు దాటినప్పుడు 100 శాతం కార్యకలాపాలు జరపవచ్చని మంత్రి పేర్కొన్నారు.

ఈ ఛార్జీల ధరలు ఎకానమీ క్లాస్‌లో యూజర్స్ డెవలప్‌మెంట్ ఫీజు, ప్యాసింజర్ సెక్యూరిటీ ఫీజు, జీఎస్‌టీ ఉండదు. ఈ సేవలు గతేడాది మే 25వ తేదీన విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించింది. మొత్తం మార్గాలను ఏడు వర్గాలుగా విభజించింది. కానీ, ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు 20 శాతం సీట్లను సగటు ఛార్జీల ధరల కంటే తక్కువగా అమ్ముతున్నాయి. దీంతో విమానయానం నష్టాల్లో నడుస్తోంది. అందుకే కేంద్రం ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి తర్వాత ఛార్జీలు..
1. మొదటి వర్గం విమాన ప్రయాణం 40 నిమిషాల ఉంటుంది. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ. 2200-7800.
2. రెండవ వర్గం విమాన ప్రయాణం 40-60 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.2800-9800.
3. మూడవ వర్గం 60-90 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.3300-11,700.
4. నాల్గవ వర్గం 90-120 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.3900-13,000.
5. ఐదవ వర్గం 120-150 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.5000-16,900.
6. ఆరవ వర్గం 150-180 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.6100-20,400.
7. ఎనిమిదవ వర్గం 180-210 నిమిషాలు. దీని ప్రైస్ బ్యాండ్ ధర రూ.7200-24,200.

Read more RELATED
Recommended to you

Latest news