ఆయన ఉంటే నేను ఉండను… కేశినేని కండీషన్…?

-

తెలుగుదేశం నేతలు ఈ మధ్య కాలంలో కాస్త సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉంది. కొంతమంది కీలక నేతల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది అనే విషయం చెప్పవచ్చు. ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కొంతమంది కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలో కేసినేని నానీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఒక నేతను బయటకు పంపిస్తే తాను పార్టీలో కొనసాగుతానని లేకపోతే తాను పార్టీలో ఉండే అవకాశమే లేదని కొందరి వద్ద చెప్పారట.

సదరు నేత విషయంలో టిడిపి నష్టపోతుంది అని గట్టిగా చెప్పినట్లుగా సమాచారం. ఆయన కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఆయన వల్లనే పార్టీ అంతా కూడా విజయవాడలో క్షేత్రస్థాయిలో నష్టపోతుంది అని స్థానిక నాయకులు కూడా ఒక రకమైన ఆందోళన కారణంగా మొదలైంది అని చెప్పడానికి రెడీ అయ్యారట. అందుకే ఒక కండిషన్ ని పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే తన సన్నిహితులతో కూడా విజయవాడలో చర్చలు జరిపారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ఆయన పార్టీ అధిష్టానం నేతలను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. సదరు నేత టిడిపి లో ఉంటే తాను కచ్చితంగా బిజెపిలోకి వెళ్ళిపోతాను అని చెప్పినట్టుగా కూడా టిడిపి వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news