కరెన్సీ నోట్లపై కరోనా ఉంటుందా.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం..?

-

ప్రస్తుతం ఏం చేయాలన్న ఎక్కడికి వెళ్లాలన్నా.. కనీసం ఏ వస్తువు నైనా ముట్టుకోవాలి అన్న కూడా భయపడే పరిస్థితి. ఎక్కడ కరోనా వైరస్ వ్యాపించి ఉందో అని ప్రస్తుతం అందరూ తీవ్ర భయాందోళన లో మునిగిపోతున్నారు. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు అందరినీ మరింత ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రతి మనిషి రోజువారీ జీవితంలో కరెన్సీ నోట్ల మార్పిడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కరెన్సీ నోట్ల మార్పిడి మాత్రం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కరెన్సీ నోట్లపై కరోనా ఉంటుందా లేదా అన్న అయోమయం ప్రజలందరిలో నెలకొంది. తాజాగా దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. కరెన్సీ నోట్లపై కరోనా ఉండడమే కాదు ఇతరులకు వ్యాపించే అవకాశం కూడా ఉందని.. అందుకే ప్రజలందరూ డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటూ కోరింది. డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు విధించే పన్నుల ను తొలగిస్తే అందరు డిజిటల్ లావాదేవీలు చేసే అవకాశం ఉందని తద్వారా కరోనా వ్యాప్తి తగ్గే అవకాశం కూడా ఉందని ఆర్బిఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news