బిగ్ బాస్ 4 : ఈ వారం నామినేట్ అయింది వీళ్లే..?

-

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరిని తనవైపుకు తిప్పుకుని ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. వారం మొత్తం కంటెస్టెంట్ లతో ఎంటర్టైన్మెంట్ … ఆ తర్వాత వారాంతం రెండు రోజులు నాగార్జున వచ్చే బుల్లితెర ప్రేక్షకులందరికి అంతకుమించి అనేంతలా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను బిగ్ బాస్ హౌస్ పైనే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ వారం ఏకంగా తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేట్ అయిన వాళ్లలో… లాస్య, అమ్మ రాజశేఖర్, నోయల్, సుజాత, అఖిల్, అభిజిత్, మోనాల్, అరియానా, సోహెల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో పోటీ మరింత రసవత్తరంగా మారిపోతున్న నేపథ్యంలో.. సైలెంట్ గా ఉన్న కంటెస్టెంట్ లు సైతం తమ లోని మరో కోణాన్ని కూడా బయటికి తెస్తున్నారు. మరి ఈ వారం నామినేట్ అయిన ఈ తొమ్మిది మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news