గ్యాంగ్ రేప్ తరువాత నాలుక కోసి వెన్ను విరోగ్గట్టిన స్థితిలో దొరికిన హత్రాస్ దళిత యువతి ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటకు వచ్చింది. రేప్ కి సంబంధించి ఎలాంటి సూచనలు లేవు” అని ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఆమె మీద అత్యాచారం జరగలేదని రాష్ట్ర పోలీసులు చెబుతున్న వర్షన్ కి మద్దతు ఇచ్చినట్టు అయింది.
ఆగ్రాలోని ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) నివేదిక ప్రకారం ఆమె శరీరం నుండి తీసిన నమూనాలలో స్పెర్మ్ లేదని చెప్పారు. అయితే, దాడి జరిగిన 11 రోజుల తరువాత సేకరించిన నమూనాల ఆధారంగా రేప్ జరగలేదని ఎలా చెబుతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం బాధితురాలి కుటుంబంలోని వ్యక్తితో పాటు దాదాపు 500మంది కలిసి బీజేపీ లీడర్ రాజ్ వీర్ సింగ్ పెహెల్వాన్ ఇంటి ముందు మూగారు. దీనికి సంబంధం లేని నలుగురు యువకులను అరెస్ట్ చేశారని.. సరైన న్యాయం చేయడం లేదని నిలదీస్తున్నారు.