గృహ హింస ఉందా…? అయితే వాట్సాప్ నెంబర్ ఇదే…!

-

లాక్ డౌన్ సమయంలో భార్యలను భర్తలు అనేక విధాలుగా వేధిస్తున్నారు, గృహ హింస పెరిగిపోయింది అనే ఆరోపణలు వస్తున్నాయి. రోజు రోజుకి ఈ హింస ఎక్కువ అవుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చిన్న పిల్లలను మహిళలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. గృహ హింసను కట్టడి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలవాలని నిర్ణయించినట్లు ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మహిళలపై గృహహింస, భౌతిక హింస ఎక్కువవుతున్నట్లు మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చిందన్న ఆమె అందుకు చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.

ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల కోసం 6301411137 వాట్సాప్‌ నెంబర్‌ మహిళలకు అందుబాటులో ఉంటుందని, వాటితో పాటు మహిళా కమిషన్‌ డైరక్టర్‌ ఆర్‌ సూయజ్‌ 9701056808, సెక్రటరీ ఎంజే నిర్మల 9603914511 వాట్సాప్‌ నెంబర్లుతో హెల్ప్‌ డెస్క్‌ కూడా అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news