ఢిల్లీ జూ లో పులికి కరోనా…?

-

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మనుషుల ఆరోగ్యం, మనుషుల ప్రాణాలే కాదు జంతువుల ప్రాణాలు జంతువుల ఆరోగ్యం మీద కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా వైరస్ జంతువులకు కూడా సోకుతుంది అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఒక జూ లో పులికి కరోనా సోకినా తర్వాత… పిల్లులకు కూడా కరోనా వైరస్ సోకింది. దీనితో అసలు ఏం జరుగుతుంధో ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి అర్ధం కావడం లేదు.

పెంపుడు జంతువులను పెంచుకునే వారి తో పాటుగా, ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. తాజాగా మన దేశంలో కూడా ఇప్పుడు జంతువులకు కరోనా సోకుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లోని ఒక జూ లో పులికి కరోనా వైరస్ సోకింది అని వార్తలు వస్తున్నాయి. గురువారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఓ పులి చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే అది చనిపోయిందని జూ అధికారులు చెబుతున్నా కాదు కరోనా వచ్చింది ఏమో అనే అనుమానం తో వెంటనే దానికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శాంపిల్స్ తీసుకుని దానికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో చెందిన నదియా అనే నాలుగేళ్ల పులికి కరోనా వైరస్ సోకిందని ఈ నెల 5న అమెరికా అధికారుల నుంచి ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news