సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు కొన్ని కొన్ని వార్తలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విపక్ష తెలుగుదేశం చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. తాజాగా చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా. అసలు టీడీపీ సోషల్ మీడియా ఏమంటుంది…?
ఇటీవల జగన్ వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడంపై ప్రస్తావిస్తూ, ఒక గల్ఫ్ దేశానికి చెందిన అధికారులు జగన్ ని విచారించడానికి సిద్దంగా ఉన్నారని, సెర్బియాలో ఆయన్ను అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.
ఇప్పుడు ఆయనను బయటకు తీసుకురాకపోతే జగన్ ఇబ్బంది పడతారని, ఆయనతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వాస్తవానికి నాగార్జున, చిరంజీవి కూడా నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపార భాగస్వాములు, పరోక్షంగా జగన్ తో కూడా వీళ్ళకు సంబంధం ఉంది. దీనితో చిరంజీవిని రంగంలోకి దింపారు జగన్. ఆయనకు రాజ్యసభ ఇచ్చి పంపించాలని భావిస్తున్నారు.
ఆ రాజ్యసభ సీటుని బిజెపి నుంచి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి బిజెపిలో చేరే అవకాశం ఉందని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాజ్యసభ సీటు ఖరారు చేస్తారని, తద్వారా చిరంజీవి సహకరిస్తారని టీడీపీ సోషల్ మీడియా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఇది ఎంత వరకు నిజం…? అసలు ఇది నిజమా కాదా అనేది తెలియదు గాని చిరంజీవి సైరా సినిమా చూపించడానికి ప్రధాని వద్దకు వెళ్ళింది ఇదే విషయాన్ని చర్చించడానికి అంటున్నారు.