పిచ్చుకలు అంతరించి పోవడానికి అసలు కారణం ఇదేనా..!

-

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. కనుమరుగవుతున్న ఖాళీ స్థలాలు.. పెరుగుతున్న ఆకాశ హర్మ్యాలు.. గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు.. సెల్‌పోన్ల నుండి వెలువడుతున్న రేడియోధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిలా రావాలతో కళకళలాడిన ఊరపిచ్చుకలు అంతర్ధామయ్యాయి.

sparrows

ఇక పక్షులు తమ కిలకిలరావాలతో పల్లెకు మేల్కొలుపు పలికెవి. తెల్లవారు జామున ఆహ్లాదాన్ని పంచి ఉత్సాహాన్ని నింపేవి. కాలం మారుతున్న కొద్ది ఎన్నో పక్షులు అంతరించిపోతున్నాయి. అయినప్పటికీ అడవుల్లో అరుదైన రకాల పక్షులు దర్శనమిస్తున్నాయి. మెల్లమెల్లగా ఊరపిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది. దశాబ్దం క్రితం వరకూ నగర వ్యాప్తంగా బర్డ్ వాచర్స్ లెక్కల ప్రకారం 10 వేలకుపైగా ఊరపిచ్చుకలు కిచకిచమంటూ నగరవాసికి సరికొత్త అనుభూతిని కలిగించేవి. అయితే ఇప్పుడా జాతి దాదాపుగా అంతిమ దశకు చేరుకోవడం పట్ల పక్షి ప్రియులు, పర్యావరణ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

అడవులకు నెలవైన ఆదిలాబాద్ అడవుల్లో ఎన్నో రకాల పిచ్చుకలు ఆవాసం ఏర్పాటు చేసుకునేవి. ఇపుడు అడవులు పలుచబడ్డాయి. ఆవాసం లేక పిచ్చుకలు పట్టణాలకు వలస బాట పట్టాయి. పట్టణంలో పెరిగిపోయిన కాలుష్యం, సెల్ టవర్ల రేడియేషన్ కారణంగా వాటి మనుగడకు ముప్పు ఏర్పడింది. ఫలితంగా ఎన్నో పిచ్చుక జాతులు అంతరిచిపోతున్నాయి. అయినా ఆదిలాబాద్ అడవుల్లో సుమారు 20 రకాల అరుదైన పిచ్చుకలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్చి 20వ తారీఖున ప్రపంచ పిచ్చుకలు దినోత్సవం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అడవుల్లో సందడి చేసిన కొన్ని అరుదైన జాతి పిచ్చుకలు సందడి చేస్తున్నాయి.

ఇంట్లో ఉండే స్క్రాప్ వేస్ట్, ఉడెన్ పీసెస్‌తో పిచ్చుకల గూళ్లు తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన పిచ్చుక గూళ్లను స్నేహితులు, ఆత్మీయులకు గిప్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. తద్వారా వారిలో పిచ్చుకలు అంతరించిపోతున్న విషయంపై ఆలోచన రేకెత్తించగలం. అంతేకాకుండా ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్నిటాలజీ విభాగం లాంటివి పిచ్చుక గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news