మాస్క్ వేసుకోనన్న ప్రయాణికుడు, సెక్యూరిటీకి అప్పగించిన ఇండిగో సిబ్బంది !

Join Our Community
follow manalokam on social media

విమానంలో సిబ్బంది పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫేస్ మాస్క్ ధరించనందుకు గాను కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకుడిని సెక్యూరిటీకి అప్పగించినట్లు ఇండిగో శనివారం తెలిపింది. ఇండిగో 6 ఇ 938 నెంబర్ గల  బెంగళూరు-కోల్‌కతా విమానంలో ప్రయాణికుడు శనివారం నాడు మాస్క్ ధరించలేదని, ఎన్ని సార్లు విమాన సిబ్బంది హెచ్చరికలు చేసినా నిరాకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ వారం మొదట్లో కూడా ఎయిర్ ఏషియా ఇండియా తన గోవా-ముంబై విమానంలో ఇద్దరు ప్రయాణికులు కోవిడ్ -19 నిబంధనలు పాటించనందుకు గాను దించేసి  భద్రతా అధికారులకు అప్పగించింది. మొన్నటికి మొన్న మంగళవారం నాడు కూడా అలయన్స్ ఎయిర్ కి చెందిన విమానంలో ఉన్న నలుగురు ప్రయాణికులు కూడా సిబ్బంది పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ఫ్లైట్ లోపల మాస్క్‌లు సరిగా ధరించలేదు, దీంతో వారిని కూడా దించేసారు. ఈ మాస్క్ లు ధరించే అంశం మీద అన్ని విమాన సంస్థలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...