విశాఖపట్నంలో మాట్లాడకుండానే వెళ్లిపోయిన సీఎం జగన్.. అందుకేనా..?

-

నిన్న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ విధమైన సందేశం ఇవ్వకుండానే స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం వైభవంగా జరుగగా, భారీ ఎత్తున ప్రజలు, సందర్శకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రిని పలువురు సన్మానించారు. ఆ తరువాత జగన్ మాట్లాడతారని, విశాఖకు మరిన్ని వరాలను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, జగన్ మాత్రం తనను సన్మానించిన వారికి ధన్యవాదాలు తెలిపి, వెళ్లిపోయారు. అయితే ఈనెల 27న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోకపోయినా.. రాజధాని తరలింపు కచ్చితంగా ఉంటుందని మంత్రులతో చెప్పారు సీఎం.. అంతేకాదు ఈ విషయాన్నీ ప్రజలతో చర్చించాక ముందుకు వెళదామని సూచించారు.

ఆ తరువాత మంత్రి పేర్ని నాని సైతం ఇదే విషయాన్నీ వెల్లడించారు. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనకు వెళ్లిన ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవడానికి కారణం ఏంటో అర్ధం కాక రాజకీయ పార్టీలు తలపట్టుకున్నాయి. ఇందుకు కారణం జగన్ వ్యూహాత్మకమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపేమో అమరావతిలో నిరసనలు, మరోవైపు ఇప్పుడిప్పుడే రాయలసీమలో మొదలవుతున్న అసంతృప్తులు మధ్య రాజధానిపై ఎలాంటి ప్రకటన చెయ్యకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news