ఆయన ఫైర్ బ్రాండ్. పార్టీ ఇమేజ్ కన్నా.. వ్యక్తిగత ఇమేజ్‌తో రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న నాయకుడు. అయితే.. ఆయన ఏ పార్టీలోనూ నిలవలేక పోతున్నారు. దీనికి కారణం.. రాజకీయ శత్రుత్వం ఎక్కువగా ఉండడమే. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్ప టి కీ.. ఆయనకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఆయనే.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. తనపై ఉన్న కొన్ని కేసులకారణంగా ఆయన అధికార పార్టీ తరఫునే తన గళం వినిపించడం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చారు. ఆయన వియ్యంకుడు సామినేని ఉదయభాను స్వయంగా త్రిమూ ర్తులను వైసీపీలోకి తీసుకువచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయనకు వైసీపీలో కీలక పదవులు దక్కాయి. అమలాపురం పార్ల మెంటు వైసీపీ ఇంచార్జ్‌గా త్రిమూర్తులు ఉన్నారు. అదేసమయంలో మండపేట నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. కానీ, వాస్తవాని కి.. త్రిమూర్తులు రాజకీయం అంతా కూడా.. రాజమహేంద్రవరం నుంచే! దీంతో ఆయన దృష్టంతా కూడా ఇక్కడే ఉంది.
అయితే..వైసీపీలోకి త్రిమూర్తులు రావడాన్ని మాజీ మంత్రి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకిం చారు. ఇక, ఈ క్రమంలోనే అంతర్గత పోరు ఇరువురి మధ్య కొనసాగుతోంది. అదేసమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా త్రిమూర్తులను రామచంద్రపురంలోకి అడుగు పెట్టకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బోసు, చెల్లు బోయినలు చేయిచేయి కలిపారు. పైగా బోసు, చెల్లుబోయిన శట్టిబలిజ వర్గం.. త్రిమూర్తులు కాపు సామాజిక వర్గం.
దీంతో సామా జిక వర్గాల పరంగా చూసినా.. వీరి మధ్య వివాదాలు, విభేదాలు ఉన్నాయి. దీంతో రాజకీయంగా త్రిమూర్తులును తొక్కేయాలనే ఉద్దేశంతో వీరు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఈ క్రమంలోనే మళ్లీ పాత కేసును ఉటంకిస్తూ.. బోస్ తాజాగా రాష్ట్ర హోం మంత్రికి లేఖరాశారని చెబుతున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో పెను దుమారమే రేపిందని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.